ఆళ్లగడ్డలో AE లంచం కేసులో ACB వల
ఆళ్లగడ్డ రహదారులు, భవనాలు శాఖ డివిజన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి సోమవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ACB డీఎస్పీ సోమన్న వివరాల ప్రకారం, ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనికి సంబంధించి కాంట్రాక్టర్ నుండి AE దస్తగిరి రూ.55,000 లంచం డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. బాధితుడు రమేష్ మొదట రూ.40,000 చెల్లించగా, మిగిలిన రూ.15,000 కోసం AE మరోసారి ఒత్తిడి చేయడంతో ఆయన ACB అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు సోమవారం వలపని వేసిన అధికారులు, AE దస్తగిరిని లంచం స్వీకరించే ప్రయత్నంలో పట్టుకుని కేసు నమోదు చేశారు.