ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
తెలంగాణ : కుటుంబంలోని విభేదాల కారణంగా మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం చర్లపల్లి పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధుసూదన్ రెడ్డినగర్ కు చెందిన బత్తుల గోపాల్, ప్రసన్న దంపతులు విడాకులు తీసుకున్నారు. వారి కుమార్తె సృష్టిత (21) తల్లితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం సృష్టిత తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.