ఉరేసుకుని యువతి ఆత్మహత్య!
తెలంగాణ : అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరూడ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె ఇషిక (29) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రముఖ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తోంది. జూన్ చివరి వారంలో HYDకు వచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తోంది. బుధవారం గదిలో నుంచి బయటికి రాకపోవడంతో తల్లి రాత్రి 7 గంటల ప్రాంతంలో వెళ్లి చూడగా ఉరేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు