అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?*

*అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?*

ఎమ్4 న్యూస్ ప్రతినిధి*

భూపాలపల్లి జిల్లా అక్టోబర్27
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దారుణ సంఘటన చోటుచేసుకుం ది, బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు చొరబడ్డాడు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ హాస్టల్లోకి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి.

*వివరాల ప్రకారం..*

భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో ఓ యువ కుడు ప్రవేశించడం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో యువకుడు హాస్టల్‌లోకి వెళ్లి.. కాసేపు తర్వాత తిరిగి వెళ్లిపోవ డం.. బాలికల హాస్టల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.

దీంతో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై హాస్టల్ ఇంచార్జ్ వార్డెన్ సోమలత చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే… అర్ధరాత్రి పూట ఓ యువకుడు బాలికల హాస్టల్‌లోకి వెళ్తుంటే.. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఎటు వెళ్లారు?ఏం చేస్తున్నారు? అని బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని… సంబంధిత సిబ్బందిపై, హాస్టల్‌లోకి ప్రవేశించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment