శృంగారంలో ఉండగా గుండెపోటు వచ్చిందని..మొగుడ్ని లేపేసిన భార్య..!!
డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను చంపేసింది ఓ భార్య. కరీంనగర్ లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో గురువారం సీపీ గౌస్ ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తి మౌనిక, సురేశ్ 2015లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సప్తగిరికాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
అయితే ఇటీవల మౌనిక సెక్స్‌వర్కర్‌గా మారింది. అయితే సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. ఇందుకు వారు కొన్ని సూచనల కూడా ఇచ్చారు. ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ దానిని తినలేదు.
ప్లాన్ బీలో భాగంగా… సెప్టెంబర్17న సురేశ్ మద్యం తాగుతుండగా.. అందులో బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి అందులో కలిపింది. అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్‌కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. శృంగారం చేస్తుండగా.. స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. వెంటనే సురేష్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మౌనిక ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కదలికలపై ఫోకస్ పెట్టారు. లోతుగా దర్యాప్తు చేయగా మౌనిక అసలు నిజం ఒప్పుకుంది. తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు..!