పాదయాత్రగా శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి సన్మానం
ఎమ్4 ప్రతినిధి ముధోల్
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలై సన్నిధానానికి మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన పాండు స్వామి పాదయాత్రగా వెళ్లి తిరిగి వచ్చిన సందర్భంగా శుక్రవారం బైంసా పట్టణ కేంద్రంలోని కాలనీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. గత 41 రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించి దాదాపు 1600 కిలోమీటర్లు పాదయాత్ర నడిచి వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నారు. పాదయాత్రను విజయవంతంగా ముగించుకొని భైంసాకు వచ్చిన సందర్భంగా కాలనీ సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు మోహన్, కాలనీ అయ్యప్ప సన్నిధానం గురుస్వామి మెంచు శివాజీ, సందీప్ పటేల్, సాయిబాబా, పాంచాల్ నరేష్, కొత్తూరు వారి రాజేష్, కురువల్ల సాయినాథ్, తిమ్మాపూర్ విశాల్ రావు, స్వాములు, తదితరులు పాల్గొన్నారు.