చాతా గ్రామంలో మృత్యువుతో ముడిపడిన అనుమానాస్పద హత్య..
70 ఏళ్ల వృద్ధుడిని ఇంట్లోనే గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
మనోరంజని ప్రతినిధి భైంసా జులై 18 – నిర్మల్ జిల్లా కుబీర్ మండలం లోని చాతా గ్రామంలో గురువారం రాత్రి ఒక దారుణం చోటు చేసుకుంది. తాళ్ళపల్లి బలరాం గౌడ్ (70) అనే వృద్ధుడు అతని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మెడపై నరికి హత్య చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి కుమారుడు తాళ్ళపల్లి రమేష్ గౌడ్, కోడలు మృతుడి చిన్న కూతురి వద్దకు వేములవాడకు వెళ్లారు. వారు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బయటికి వెళ్లిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచి బలరాం గౌడ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం, ఫింగర్‌ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు సేకరించారు. ఇంట్లో దొంగతనానికి గురైనట్లయితేనా? వ్యక్తిగత దుష్పరిణామమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
బలరాం గౌడ్‌కి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో భయం మరియు ఆందోళన వాతావరణం నెలకొంది. నేరస్థులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని స్థానికులు డి
డిమాండ్ చేస్తున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది