- లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన సురేష్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది.
- సంఘటనలో సురేష్, అతని కుమారుడు దీక్షిత్ కుమార్ దుర్మరణం చెందారు.
- భార్య, కూతురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
విధులకు హాజరయ్యేందుకు కుచులాపూర్ గ్రామం నుంచి బయలుదేరిన సురేష్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో సురేష్, అతని కుమారుడు దీక్షిత్ కుమార్ ప్రాణాలు కోల్పోగా, భార్య, కూతురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
లోకేశ్వరం మండలం మన్మధ్ గ్రామానికి చెందిన సంగెం సురేష్ (27) కుటుంబం దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురైంది. విధులకు హాజరయ్యేందుకు సురేష్ కుటుంబం ఆదిలాబాద్ జిల్లా కుచులాపూర్ గ్రామం నుంచి కారులో బయలుదేరింది. నర్సాపూర్ మండలంలోని తురాటి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో, అతని కుమారుడు దీక్షిత్ కుమార్ (7) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సురేష్‌తోపాటు భార్య, కూతురు తీవ్రంగా గాయపడి చికిత్స కోసం నిర్మల్‌కు తరలించబడ్డారు. చికిత్స పొందుతూనే సురేష్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.