ఘోర విమాన ప్రమాదం?*

*ఘోర విమాన ప్రమాదం?*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

హైదరాబాద్:అక్టోబర్ 28
కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం కెన్యాలోని క్వాలే కౌంటీలో టూరిస్టులతో ప్రయాణిస్తు న్న విమానం కూలిపోయి 12మంది మృతిచెందారు.

12మంది పర్యాటకులతో డయాని నుండి మాసాయి మారా వెళ్తున్న ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింద ని,కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.

ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,

ఈ విమానం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మాసాయి మారా నేషనల్ రిజర్వ్ వైపు వెళ్తోంది. డయానీ ఎయిర్‌స్ట్రిప్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మాసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టు ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment