రూ.1000 కోసం స్నేహితుడి దారుణ హత్య

రూ.1000 కోసం స్నేహితుడి దారుణ హత్య

మనోరంజని తెలుగు టైమ్స్ రంగారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 26

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రూ.1000 కోసం తలెత్తిన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వట్టేపల్లిలో నివాసం ఉండే సయ్యద్ అఫ్రోజ్(21) గతంలో అబ్బు అనే వ్యక్తి వద్ద తీసుకున్న రూ.1000 విషయంలో రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో అఫ్రోజ్ ను హత్య చేయాలని తన మిత్రులు సోహెల్, రిజ్వాన్ లతో అబ్బు ప్లాన్ వేశాడు. తన మిత్రులతో కలిసి రాత్రి అఫ్రోజ్ ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అఫ్రోజ్ గాయాలై మృతి చెందాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment