నల్లగొండ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య?
నల్లగొండ జిల్లా:ఆగస్టు 28
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గురువారం ఉదయం వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యం లో, సిబ్బందితో హుటా హుటిన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నా రు. చనిపోయిన వ్యక్తి చింతికింది రమేష్,(42)గా గుర్తించారు. మూడు నెలల క్రితమే కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్ళినట్లు తెలుస్తుంది,
కొన్ని ఏండ్లుగా బీ టీ ఎస్ కాలనీలోని ఓ ఇంటిలో నివసిస్తు డ్రైవర్‌గా పని చేస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.అయితే చెవి పైన గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.