విధి ఆడిన ఆట.. లేటుగా వచ్చాడని బయట నిలబెట్టారు.. నిల్చున్న చోట గోడ కూలి 5ఏళ్ల విద్యార్థి..మృతి!

విధి ఆడిన ఆట.. లేటుగా వచ్చాడని బయట నిలబెట్టారు.. నిల్చున్న చోట గోడ కూలి 5ఏళ్ల విద్యార్థి..మృతి!

విధి ఆడిన ఆట.. లేటుగా వచ్చాడని బయట నిలబెట్టారు.. నిల్చున్న చోట గోడ కూలి 5ఏళ్ల విద్యార్థి..మృతి!

 

కర్నూలు జిల్లా

 

కర్నూలు నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

నగరంలోని కవాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గోడ కూలి ఓ చిన్నారి మృతి చెందగా.. మరో 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..

 

సోమవారం ఉదయం పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన కొంతమంది విద్యార్థులను యాజమాన్యం బయట నిలబెట్టింది.

ఈ సమయంలో పాఠశాల గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో విద్యార్థులు దాని కింద చిక్కుకున్నారు.

ఈ ఘటనలో ఐదేళ్ల రకీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలిసిన వెంటనే ఎస్ఎఫ్ఐ, సిపిఎం, సిఐటియు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

 

ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పందించారు. బాలుడి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులకు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ యాజమాన్యంతో చర్చించి, బాలుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment