మంత్రి కొండ సురేఖకు నాంపల్లి కోర్టు లీగల్ నోటీసులు

Konda Surekha Court Notice
  • మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు నుండి నోటీసులు
  • హీరో అక్కినేని నాగార్జున క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలు
  • విచారణను ఈ నెల 23కు వాయిదా

 

హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం పిటీషన్‌లో కోర్టు విచారణను అక్టోబర్ 23కి వాయిదా వేసింది. ఈ కేసులో సాక్షులుగా సుప్రియ మరియు వెంకటేశ్వర్లను ఉంచారు.

 

మాజీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసులో నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సురేఖపై పరువునష్టం కేసు వేశారు. పిటిషన్ దారుడిగా నాగార్జున, సాక్షిగా సుప్రియ స్టేట్‌మెంట్‌ను ఈ నెల 8న కోర్టు రికార్డు చేసింది.

విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేసిన కోర్టు, మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాదులు నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించింది. న్యాయస్థానం పూర్తి సంతృప్తి చెందితే విచారణ కొనసాగుతుంది; లేనిచో మంత్రి స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ కేసులో మూడవ సాక్షిగా వెంకటేశ్వర్లను ఉంచడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment