జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
నిర్మల్: అక్టోబర్ 02
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ మోసాలపై ప్రజల అవగాహన పెంచడానికి ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగ్రత్త దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో, నిర్మల్ పట్టణ బస్టాండ్ వద్ద సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎల్.వి. రమణారావు, ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ నేతృత్వంలో టీం ప్రజలకు సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ప్రధానంగా ఆన్లైన్ మోసాలు, వంచన పద్ధతులపై ప్రజలను హెచ్చరించారు. అలాగే, ఎలాంటి సమాచారాన్ని ఆన్లైన్లో అందజేయకూడదో వివరించారు. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు.