‘దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
కడప జిల్లా
కడప జిల్లాలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ మస్తాన్ వలి అనే వ్యక్తి మృతిచెందిన ఘటన జరిగింది. మృతుడు సీకేదీన్నె మండలానికి చెందిన 40 సంవత్సరాల మస్తాన్ వలీగా గుర్తించారు.
‘దేవర’ మూవీ విడుదల సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. మస్తాన్ కూడా ఈ షోకు హాజరయ్యాడు. సినిమా చూస్తూ ఉత్సాహంగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో, అనుకోకుండా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించినప్పుడు అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.