మహలింగి గ్రామంలో దొంగల అరాచకం: గ్రామస్తులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగింపు

Alt Name: Theft Attempt in Mahalingi Village, Suspects Handed to Police

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తానూర్, సెప్టెంబర్ 27

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మహలింగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. గ్రామస్తులు అప్రమత్తమై నలుగురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తానూర్ ఎస్సై డి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముతూ ఇంట్లోకి చొరబడ్డారని, గ్రామస్థుల చర్యతో వారు వెంటనే పట్టుబడ్డారని తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment