ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్: సెప్టెంబర్ 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని తాండ్ర. జి గ్రామ శివారులో బుధవారం కురిసిన భారీ వర్షం తుమ్మల వాగును ఉప్పొంగించించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో, రైతు జాదవ్ అరవింద్ ఎడ్ల కచరం ఎడ్ల బండితో వాగు దాటుతున్నప్పుడు వరద వలన రెండు ఎడ్లు మరియు ఒక దూడ కొట్టుకుపోయాయి. అయితే, ఎడ్ల బండి తీగకు తట్టుకొని ఆగిపోయింది.
గ్రామస్తుల ప్రకారం, రెండు ఎడ్లు బండ రాళ్లతో తగలడంతో మరణించాయి, వీటి విలువ సుమారు ఒక లక్ష (1,00,000) రూపాయలు. బాధిత రైతు ప్రభుత్వం నుంచి సాయం అందించాలని అధికారులను వేడుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే, సారంగాపూర్ మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తుమ్మల ఒర్రె దగ్గరికి వెళ్లి రైతు జాదవ్ అరవింద్ ను పరామర్శించారు.
ఈ సందర్బంగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరథ్ రాజేశ్వర్, మాజీ సర్పంచ్ బ్యాగారి ఎల్లన్న, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ రావు, ద్యాగ ప్రశాంత్, రైతులు గోవింద్, నర్సయ్య తదితరులు కూడా ఉన్నారు.