హైదరాబాద్: సెప్టెంబర్ 25
దివానచెరువు నుంచి కడియం ప్రాంతానికి వచ్చిన చిరుతపై అధికారులు తాజాగా ప్రకటన చేశారు. కాలి ముద్రల ద్వారా గుర్తించిన ఈ చిరుత, గత నాలుగు రోజులు రాజమండ్రి శివార్లలో కనిపించలేదు.
కడియం వీరవరం రోడ్ మధ్యలో దోషాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనుగొనబడడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు కడియం ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.
అటవీశాఖ అధికారి, నర్సరీలలో నివసిస్తున్న స్థానికులపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.