మహారాష్ట్రలో అమరావతిలో ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

Alt Name: అమరావతి బస్సు ప్రమాదం
  • అమరావతి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం
  • బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి, పలువురు గాయపడ్డారు
  • ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు

 Alt Name: అమరావతి బస్సు ప్రమాదం

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరాట్వాడ-ధరణి రహదారి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరాట్వాడ-ధరణి రహదారి వద్ద సేమడోఫ దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం ప్రమాదకరమైన వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమేనని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment