నాగిరెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువకుడు మృతి

**నాగిరెడ్డిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువకుడు మృతి

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మనోహర్ రెడ్డి డిమాండ్**

నాగిరెడ్డిపేట, డిసెంబర్ 30 (మనోరంజని తెలుగు టైమ్స్):

నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెల్లకుంట గ్రామానికి చెందిన మూడ బిచ్చు నాయక్ బస్సు–ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ప్రమాదం అనంతరం బిచ్చు నాయక్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, తలకు తీవ్రమైన గాయాల కారణంగా సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మంగళవారం గాంధీ ఆసుపత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడి పోస్ట్‌మార్టం ప్రక్రియను పూర్తిచేయించారు. అనంతరం ప్రభుత్వ ఉచిత అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామమైన మెల్లకుంటకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబానికి చెందిన బిచ్చు నాయక్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment