అనారోగ్యంతో మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 24
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మలక్ చించోలి లోచోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మలక్ చించోలి గ్రామానికి చెందిన మర్రి ఆడెళ్లు(50) గత కొత్త కాలంగా కంటి చూపు రేచీకటితో అనారోగ్య సమస్యలతోబాధపడుతున్నాడు. పలు ఆస్పత్రిల్లో వైద్యం చేపించినా నయం కాలేదు. ఈ క్రమంలో గురువారం ఐదు రోజుల క్రితం ఆడెల్లు మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీ కాంత్ తెలిపారు.మృతుని కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.