శతాబ్ది వృద్ధురాలు మృతి
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, డిసెంబర్ 05
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో శతాధిక వయస్సు దాటిన వృద్ధురాలు అబ్దుల్ వాజిద్ బీ (106) కన్నుమూశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది నాయనమ్మ అయిన వాజిద్ బీ శుక్రవారం ఉదయం స్వర్ణ గ్రామంలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య కారణాలతో ఇటీవల అస్వస్థతకు గురైన ఆమె మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.