చావుకు కూడా బందువులే లేని వృద్ధుడి అంతిమ సంస్కారాలు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సేవా హస్తం
మనోరంజని తెలుగు టైమ్స్, ప్రొద్దుటూరు – నవంబర్ 27
స్థానిక ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లెల నారాయణ అనే వృద్ధుడు మరణించాడు. అయితే అంతిమ సంస్కారాలకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్కి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి, గురువారం హిందు స్మశాన వాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, మైఖేల్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తరఫున సేవా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ అమ్మ శరణాలయం వృద్ధులకు సహాయం చేయదలిచిన దాతలు సంప్రదించవలసిన సంఖ్యలు:
📞 82972 53484, 91822 44150