చెప్పులు, చెత్తడబ్బా… ‘సర్పంచ్’ గుర్తులివే!
మనోరంజని తెలుగు టైమ్స్ – హైదరాబాద్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా సర్పంచ్ అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) మొత్తం 30 గుర్తులు కేటాయించింది. గ్రామాల్లో చర్చనీయాంశమవుతున్న ఈ గుర్తుల్లో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్ వంటి పలు రోజువారీ వాడుకలో ఉండే సూచికలు ఉన్నాయి.
అదే విధంగా లేడీస్ పర్స్, రిమోట్, టూత్‌పేస్ట్, బ్లాక్‌బోర్డు, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్‌హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ వంటి గుర్తులను కూడా అభ్యర్థులు ఉపయోగించుకోనున్నారు.
వార్డు సభ్యుల కోసం అదనంగా 20 గుర్తులు SEC విడుదల చేసింది. స్థానిక రాజకీయాల్లో ఈ గుర్తుల ఎంపికపై గ్రామస్తుల్లో ఆసక్తి నెలకొంది.
—