మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య

తానూరు మనోరంజని ప్రతినిధి నవంబర్ 8

తానూర్ మండలంలోని బోసి గ్రామ సమీపంలో గల ఓ డాబాలో బామ్ని గ్రామానికి చెందిన
బాశెట్టి రాజు(41) అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజు దాబాలో వంట చేసేవాడని అతిగా మద్యం సేవించడం వలన మద్యానికి బానిస అయ్యాడు. కొన్ని రోజులు మద్యం మానేశాడు. మద్యం మానేయడంతో మానసిక సమతుల్యతను కోల్పోయినట్లు ప్రవర్తించారని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించడంతో మద్యం మత్తులోనే ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హన్మండ్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment