లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : సీ.ఐ పొన్నం సత్యనారాయణ

లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : సీ.ఐ పొన్నం సత్యనారాయణ

వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త – సమాచారం ఇస్తే కేసులు చేస్తాం

భీమ్ గల్, నవంబర్ 08 (మనోరంజని తెలుగు టైమ్స్ భీమ్ గల్ ప్రతినిధి):

లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : సీ.ఐ పొన్నం సత్యనారాయణ


అమాయక వినియోగదారులను మోసం చేసేందుకు లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు పేరుతో వ్యాపారులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ హెచ్చరించారు. భీమ్ గల్ సర్కిల్ పరిధిలోని కొందరు రియల్టర్లు, వాహన షోరూమ్ యజమానులు, దుకాణదారులు ఈ తరహా డ్రాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ సందీప్‌తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ – “అమ్మకాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ప్రజలను లక్కీ డ్రా, బంపర్ డ్రా పేరుతో మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని తెలిపారు. భీమ్ గల్ సర్కిల్ పరిధిలోని మోర్తాడ్, కమ్మర్ పల్లి ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు త‌మ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి డ్రాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సత్యనారాయణ సీ.ఐ హెచ్చరిస్తూ – “లక్కీ డ్రాలు చట్టరీత్యా నేరం. ఇలాంటి మోసగాళ్లపై జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటాం. డ్రా నిర్వాహకులు ప్రజల డబ్బులు గుంజి పారిపోవడం లేదా కేసులు పెట్టించుకోవడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసపూరిత వలలో పడకూడదు” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment