ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలి – ఎంపీడీవో లక్ష్మీకాంతరావు
మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్ ప్రతినిధి – నవంబర్ 07
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సారంగాపూర్ మండల ఎంపీడీవో లక్ష్మీకాంతరావు సూచించారు.
శుక్రవారం ఆయన మండలంలోని కౌట్ల బి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయో, ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయో, అవి ఏ దశలో ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు నిధులు జమయ్యాయా అని కూడా విచారించారు. స్లాబ్ దశ పూర్తి చేసిన ఇళ్లను ప్రత్యక్షంగా పరిశీలించి, మిగతా పనులను త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గృహనిర్మాణ అధికారి ఏఈ నాగార్జున, లబ్ధిదారులు పాల్గొన్నారు.