నవీపేట్ మండలంలో మహిళ దారుణ హత్య – కేసు దర్యాప్తుకు 10 స్పెషల్ టీమ్‌లు
తల, కుడి చేయి లేకుండా కనిపించిన మృతదేహం —
సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి నవంబర్ 01
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో శనివారం ఉదయం గుర్తు తెలియని మహిళా మృతదేహం బయటపడింది. అంచనా ప్రకారం 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆ మహిళ తల, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా దారుణంగా హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య (IPS) గారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆయన వెంట ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై సిహెచ్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించాయి. కేసును వేగంగా చేదించేందుకు కమీషనర్ పి. సాయి చైతన్య 10 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమానితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళ గుర్తింపు కోసం మరియు నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.