రామారావు ఏసీబీ కేసులో కీలక మలుపు

రామారావు ఏసీబీ కేసులో కీలక మలుపు

రామారావు ఏసీబీ కేసులో కీలక మలుపు

 

  • నాంపల్లి సెంట్రల్ జైలులో రామారావును ఉదయం నుంచి విచారిస్తున్న ఏసీబీ అధికారులు

  • 13 మంది దేవస్థాన సిబ్బంది, 5 మంది రిపోర్టర్లు, 7 మంది రాజకీయ నాయకుల పేర్లు వెల్లడన

  • ఇప్పటివరకు ₹4 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • మంత్రి కోమటిరెడ్డి వద్ద లాబీయింగ్ చేస్తున్న బీర్ల ఐలయ్యపై అనుమానాలు



దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ఎస్‌.ఇ. రామారావు లంచం కేసు కొత్త మలుపు తీసుకుంది. నాంపల్లి సెంట్రల్ జైలులో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రామారావు విచారణలో యాదాద్రి దేవస్థానంలోని 13 మంది సిబ్బంది, ఐదుగురు జర్నలిస్టులు, ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. ₹4 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించగా, మరికొందరిపై దర్యాప్తు కొనసాగుతోంది.



యాదాద్రి దేవస్థానంలోని లడ్డు కౌంటర్ల టెండర్ లంచం వ్యవహారంలో ఏసీబీ వలలో చిక్కుకున్న దేవాదాయ శాఖ ఇన్‌చార్జి సూపరింటెండింగ్ ఇంజనీర్ రామారావు కేసు ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది.

ఏసీబీ అధికారులు ఉదయం నుంచీ నాంపల్లి సెంట్రల్ జైలులో రామారావును విచారిస్తున్నారు. విచారణలో రామారావు యాదాద్రి దేవస్థానంలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగుల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఐదుగురు రిపోర్టర్లు, ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు కూడా వెల్లడించినట్టు సమాచారం.

ఇప్పటివరకు ₹4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి దగ్గర లాబీయింగ్ చేస్తున్న బీర్ల ఐలయ్య పేరు కూడా వినిపిస్తోంది. రామారావు మినహా ఇతరుల పేర్లు బయటకు రాకుండా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాక, వేములవాడ ఆలయంలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు కూడా రామారావుకు సహాయం చేసినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి.

ఏసీబీ అధికారులు ఈ కేసు సంబంధిత పత్రాలు, ఆడియో కాల్స్, ఫైళ్లను సమీక్షిస్తూ మరికొన్ని పేర్లు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామారావు లంచం కేసు తెలంగాణ దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి వెలుగులోకి తెస్తోందని అధికారులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment