ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ డి.ఈ
-
మెదక్ ట్రాన్స్కో కార్యాలయంలో ఏసీబీ దాడి
-
లంచం తీసుకుంటూ డి.ఈ షరీఫ్ ఖాన్ అరెస్ట్
-
పౌల్ట్రీ ఫారానికి కనెక్షన్ కోసం ₹40 వేల డిమాండ్
మెదక్ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి విద్యుత్ శాఖ డి.ఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్‌ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. పాపన్నపేట మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారానికి కనెక్షన్ ఇవ్వడానికి ₹40 వేల లంచం డిమాండ్ చేయగా, ₹21 వేల స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మెదక్ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో గురువారం సంగారెడ్డి ఏసీబీ అధికారులు సడన్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డి.ఈ) మహమ్మద్ షరీఫ్ ఖాన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకోవడానికి విద్యుత్ కనెక్షన్ కోసం డి.ఈ వద్ద అర్జీ పెట్టుకున్నాడు. అయితే కనెక్షన్ ఇచ్చేందుకు ₹40 వేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ₹30 వేలకే ఒప్పందం కుదిరింది. ముందుగా ₹9 వేల చెల్లించగా, గురువారం మిగిలిన ₹21 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి షరీఫ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ట్రాన్స్కో సిబ్బంది స్తంభించిపోయారు.