గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
మెండోరా మండలం వెల్కటూర్ శివారులో శవం లభ్యం
వయసు సుమారు 65 సంవత్సరాలు
గుర్తు తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి
మనోరంజని తెలుగు టైమ్స్ మెండోరా ప్రతినిధి అక్టోబర్ 30
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ శివారులోని బట్టపూర్ వాగు బ్రిడ్జి క్రింద గురువారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతుడు వయసు సుమారు 65 సంవత్సరాలు ఉండి, తెల్లటి ప్యాంట్, తెల్లటి షర్ట్ ధరించి ఉన్నాడు. మెడలో నీలిరంగు కండువా ఉండగా, కుడిచేతికి రాగి ఉంగరం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శవం గుర్తు తెలియడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు మెండోరా పోలీస్ స్టేషన్‌కి లేదా ఆర్మూర్ సీఐకి 8712659864, 8712659859 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.