కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి దుర్మరణం

కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి దుర్మరణం

కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి దుర్మరణం



బాల్కొండలో విషాదం – గాయాన్ని దాచిన కారణంగా రేబిస్ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన 10 ఏళ్ల బాలిక



నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ (10) అనే బాలిక కుక్క కరిచిన ఘటన నెలరోజుల తర్వాత విషాదాంతమైంది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చిన్నారి ఈ విషయాన్ని దాచిపెట్టింది.

గత మూడు రోజులుగా కుక్కలా అరుస్తూ, వింతగా ప్రవర్తించడం గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రరూపం దాల్చిందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతుండగానే ఆమె మృతిచెందింది.

ఈ నేపథ్యంలో వైద్యులు కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయరాదని ప్రజలకు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment