కర్నూలు బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి!*

*కర్నూలు బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి!*

*బస్సు ప్రమాద బాధితులకు ఐదు లక్షల పరిహారం!*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

హైదరాబాద్‌: అక్టోబర్ 24
కర్నూల్‌ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు.

అయితే ఈ ప్రమాదంలో దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుందాని హైదరాబాద్‌ వచ్చిన పలువురు సజీవదహన మయ్యారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల రమేశ్‌ కుటుంబం అగ్నికి ఆహుత య్యింది. అదేవిధంగా యాదిద్రి జిల్లాకు చెందిన ఓ యువతి కూడా మృతి చెందింది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాము అనే వ్యక్తి బెంగ ళూరులో ఉంటున్నారు. దీపావళి పండుగను సంగారెడ్డి పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీలో నివాసం ఉండే తమ బంధువుల ఇంట్లో జరుపుకోవడానికి తన తల్లితో కలిసి వచ్చారు.

గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో తల్లీ కొడుకులిద్దరు కావేరి ట్రావె ల్స్‌ బస్సులో బెంగళూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో చిన్నటేకూరు వద్ద ఓ బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. దీంతో తల్లి కొడుకులు సజీవదహనమయ్యారు.

యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నది. దీపావళి పండుగను స్వగ్రామంలో తల్లిదండ్రుల తో కలిసి జరుపుకున్న ఆమె.. గురువారం రాత్రి బెంగళూరుకు తిరిగిపయ ణమయ్యారు.లక్డీకపూల్‌లో కావేరి ట్రావెల్స్‌ బస్సు ఎక్కిన ఆమె కూడా మృతిచెందింది.

కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ”5 లక్షలు చొప్పున గాయపడిన వారికిరూ”2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తు న్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటిం చారు. కాగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆయన హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment