లారీ క్యాబిన్ నుంచి దూకి పారిపోతున్న రియాజ్… పట్టుకునేందుకు వెళ్లిన యువకుడిపై కత్తితో దాడి –
నిజామాబాద్ అక్టోబర్ 19:
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ శివారులో శుక్రవారం ఉదయం ఉత్కంఠభరిత సంఘటన చోటుచేసుకుంది. ఓ లారీ క్యాబిన్‌లో ఉన్న రియాజ్ అనే వ్యక్తి, పోలీసుల కన్నుగప్పించేందుకు అక్కడి నుంచి దూకి పారిపోతుండగా, ఆయనను వెంబడించిన కానిస్టేబుళ్లు, స్థానిక యువకులు అతన్ని అడ్డుకున్నారు. అయితే అప్పటికే రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో మరోసారి దాడికి తెగబడ్డాడు.
పట్టుకోవాలన్న ఉద్దేశంతో నెహ్రునగర్‌కు చెందిన యువకుడు అసిఫ్ అతని వెంటపడ్డాడు. ఈ క్రమంలో రియాజ్ కత్తితో అసిఫ్‌పై దాడి చేశాడు. దాంతో అసిఫ్ ఎడమచెయ్యి తీవ్రంగా గాయమై, స్థానికులు అతనిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ ఘటనను చూసిన కానిస్టేబుళ్లు వేగంగా స్పందించి, రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ పై ఇప్పటికే పలు ముద్దులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.