మాదక ద్రవ్యాలు- సైబర్ నేరాలపై అవగాహన

మాదక ద్రవ్యాలు- సైబర్ నేరాలపై అవగాహన

మాదక ద్రవ్యాలు- సైబర్ నేరాలపై అవగాహన

బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 16

భైంసా పట్టణంలోని జిపి లడ్డ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం- సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్సై నవనీత్ రెడ్డి మాట్లాడుతూ యువతలో మత్తు పదార్థాలు వాడకాన్ని నివారించడం తోపాటు సైబర్ నేరాల నుండి జాగ్రత్తగా ఉండే విధానాలపై అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. మత్తు జీవితాలను చిత్తు చేస్తుందని పేర్కొన్నారు. సానుకూల దృక్పథంతో విద్యార్థులు ఉండాలని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు తోట లక్ష్మణ్ పాటల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించారు. ఆయన పాడిన పాటలు విద్యార్థులను ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్, కళాశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment