తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కుమారుడు అరెస్టు

తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కుమారుడు అరెస్టు

తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కుమారుడు అరెస్టు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో 24 గంటల్లోనే మిస్టరీ ఛేదన

జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం మైనర్ నిందితుడిపై కఠిన చర్యలు

తానుర్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15

తానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన తండ్రి హత్య కేసు మిస్టరీని పోలీసులు కేవలం 24 గంటల్లోనే చేదించారు. కుటుంబ కలహాలు, చదువు విషయంలో మందలింపులే ఈ ఘోరానికి కారణమని దర్యాప్తులో తేలింది. తండ్రిని హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టిన మైనర్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్వీ గ్రామ శివారులో తండ్రి మృతదేహాన్ని దాచిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు అధికారి డా. జి. జానకి షర్మిల కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేయాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ను ఆదేశించారు. ఆయన నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వేగవంతంగా దర్యాప్తు చేపట్టి నిందితుడైన జూవైనల్‌ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. గత కొంతకాలంగా కుటుంబ విషయాలలో తండ్రి వన్నెవడ్ లక్ష్మణ్ తరచుగా మందలించడం అలాగే చదువులో తాను విఫలం కావడం వల్ల మైనర్ కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 31న రాత్రి చేనులో తండ్రిని గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి ఉపయోగించిన గడ్డపార, ఇనుప సలాకలు, అలాగే హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలుడు తన నేరాన్ని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ (తానూర్) జి. మల్లేష్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమైనదని విచారం వ్యక్తం చేశారు. కుటుంబ విభేదాలు, పిల్లలపై చదువు ఒత్తిడి వంటి అంశాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. తల్లిదండ్రులు వారి పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ సరైన మార్గదర్శకత్వం ఇవ్వడం బాధ్యత అని ఆమె సూచించారు. పిల్లలు మైనర్లయినప్పటికీ చట్టం ముందు ప్రతి నేరం తీవ్రంగానే పరిగణించబడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు, ‘జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015’ ప్రకారం మైనర్ నిందితులపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా జరిపి, జూవైనల్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ ఇన్స్పెక్టర్ జి. మల్లేష్, ఎస్ఐలు అశోక్, బిట్ల పెర్సిస్, నరేష్, జుబేర్, కానిస్టేబుళ్లు చౌహాన్ కృష్ణ, శ్రావణ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment