గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ అవయవాలు లభ్యం
మనోరంజని తెలుగు టైమ్స్ తానుర్ ప్రతినిధి అక్టోబర్ 13
నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వి గ్రామం సబ్ స్టేషన్ పక్కన మేకలను కాస్తున్న వ్యక్తి, నేలపై పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి తల అవయవాలను గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామ పెద్దలు వెంటనే ఈ విషయాన్ని తానూర్ ఎస్సై షేక్ జుబేర్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, తానూర్ ఎస్సై జుబేర్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహ అవయవాలను బైంసా ఏరియా ఆసుపత్రి వైద్యుల సమక్షంలో పరిశీలించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు