బాసరలో పెరుగుతున్న దొంగతనాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
*గ్రామంలో రాత్రిపూట జాగారం చేస్తున్న ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించిన బాసర పోలీసులు*
మనోరంజని తెలుగు టైమ్స్ బాసర ప్రతినిధి అక్టోబర్ 07
బాసర గ్రామంలో ఇటీవల దొంగతనాల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు రాత్రి పూట కాలనీలో కూర్చొని జాగారం చేస్తూన్నారు. ఈ విషయం తెలుసుకున్న భైంసా ఇంచార్జి ఎస్హెచ్ఓ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి సమయంలో స్వయంగా గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. గ్రామస్తులకు ధైర్యం చెప్పిన భైంసా ఇంచార్జి ఎస్హెచ్ఓ సాయి కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. దొంగలను త్వరలోనే పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు.