బెల్లంపల్లి: అడవి పందులను హతమార్చిన వ్యక్తుల అరెస్టు
బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో పత్తి చేనులో విద్యుత్ వైర్లు అమర్చి రెండు అడవి పందులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి పందులను హతమార్చి, వాటిని రాజన్న, సాయికి విక్రయించినట్లు వెల్లడించారు. నలుగురు నిందితుల నుంచి అడవి పంది మాంసం స్వాధీనం చేసుకున్నారు