సామాజిక సేవకు కీర్తి చక్ర పురస్కారం
ఉత్తమ్ బాలేరావుకు జాతీయ పురస్కారం
తానూర్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 26
తానూర్ మండలం బోసి గ్రామానికి చెందిన ప్రముఖ సమాజిక సేవకుడు మాజీ జడ్పిటిసి-ఏబీఎస్ టీజీ అధ్యక్షులు ఉత్తమ్ బాలేరావుకి ప్రతిష్టాత్మకమైన కీర్తి చక్ర జాతీయస్థాయి పురస్కారం లభించింది. వారి విశిష్ట సామాజిక సేవలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గుర్తించి ఆర్యాణీ సకల కళావేదిక ఈ అవార్డును అందించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని బాలేరావు అందుకున్నారు. కీర్తి చక్ర జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా ఉత్తమ్ బాలేరావుని బోసి గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బోసి వీడిసి ఉపాధ్యక్షులు మాముల్వార్ గంగాధర్, టక్కన్ హన్మాండ్లు, సబ్బన్ మాధవ్, గాడే లచ్చారామ్, గాడే శివనాథ్, బాయి నాగేశ్, సల్ల రాజన్న, లోసరం ముత్యం, నీలపు నర్సయ్య, బ్యాగల్ రఘునాథ్, గంగుల చిన్నన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు, ఉత్తమ్ బాలేరావుకి అభినందనలు తెలియజేసీ ఆయన సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఆకాంక్షించారు.