టెలికాం వినియోగదారులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ట్రాయ్ కాగ్ సభ్యుడు ప్రభాకర్ రావు
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ సెప్టెంబర్ 23
టెలికాం వినియోగదారులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కాగ్ సభ్యుడు రావూరి ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన టెలికాం, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ—
టెలికాం వినియోగదారుల హక్కుల కోసం భారత ప్రభుత్వం 1997లో ట్రాయ్ చట్టాన్ని తీసుకువచ్చిందని,
అవాంఛిత మొబైల్ కాల్స్ నియంత్రణ కోసం 1909 నంబర్ కేటాయించిందని,
టెలిమార్కెటింగ్ కాల్స్ అడ్డుకోవడానికి DND App డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అలాగే, 2025 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి అని తెలిపారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని వినియోగదారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో BSNL SDE గోవిందు, AFO రమణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేశ్ కుమార్ సింగ్, అలాగే ఎయిర్టెల్, Jio, Vodafone ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు.