భీమారం: అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
భీమారం మండల కేంద్రంలోని గొల్ల వాగు ప్రాజెక్టు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ను ఎస్సై శ్వేత సోమవారం పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆమె తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు