తల్లిదండ్రులకు ఏఎస్పీ రాజేష్ మీనా హెచ్చరిక: చట్టపరమైన చర్యలు తప్పవు
మనోరంజని ప్రతినిధి, నిర్మల్ – సెప్టెంబర్ 21
చిన్నారుల రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ మాట్లాడుతూ – చిన్నారులతో వాహనాలు నడపిస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల బాధ్యత కేవలం శిక్షించడమే కాకుండా, అవగాహన కల్పించడం కూడా తమ కర్తవ్యమే అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.