విద్యుత్ తీగ తగిలి ఎద్దు మృతి
మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం | సెప్టెంబర్ 16
నిర్మల్ జిల్లా లోకేశ్వరం గ్రామానికి చెందిన గొల్ల సాయన్న అనే రైతు ఎద్దుతో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో అనుకోకుండా విద్యుత్ తీగ తగిలి, ఆ ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన బాగా పూర్ కల్వర్టు దగ్గర చోటుచేసుకుంది. స్థానిక రైతులు మాట్లాడుతూ, వ్యవసాయానికి ఎంతో మద్దతుగా ఉండే ఎద్దు మృతి చెందడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఎద్దు మృతితో పాటు సాయన్నకు రూ.1 లక్షల వరకు ఆర్థిక నష్టం కలిగిందని వారు తెలిపారు. రైతులు విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ తీగలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపించారు. వెంటనే సరైన చర్యలు తీసుకుని బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు