*డీజే సౌండ్.. మరో ప్రాణం బలి*
*డ్యాన్స్ చేస్తూ 22 ఏళ్ల యువకుడు మృతి*
*డీజే సౌండ్ మరో ప్రాణాన్ని బలిగొంది. విజయనగరం జిల్లా బొబ్బాదిపేటలో వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్ బాక్సుల ముందు డాన్స్ చేస్తూ బొబ్బాది హరీశ్ (22) కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అతడు ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సాధించాడు. కాగా డీజేలో వచ్చే భారీ శబ్దాలతో గుండెపై ఎఫెక్ట్ పడుతుందని వైద్యులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ప్రస్తుతం వినాయక నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యువకులు, వినాయక మండపం నిర్వాహకులు డిజె సౌండ్ లను వాడకుండా ఉంటేనే మంచిది.*