మహారాష్ట్ర సరిహద్దులో రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర సరిహద్దులో రోడ్డు ప్రమాదం

మహారాష్ట్ర సరిహద్దులో రోడ్డు ప్రమాదం

ముగ్గురు మృతి-ఇద్దరికి గాయాలు

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన

బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4

మహారాష్ట్ర సరిహద్దులోని బోకర్ తాలూకా నందా గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హున్నపూర్ గ్రామానికి చెందిన దంపతు లు చేకూరి బుల్లిరాజు (50), సునీత (45), బంధువైన బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన వాణి (40), మరో ఇద్దరితో కలిసి బుధవారం ఉదయం కారులో మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తెలంగాణ సరిహద్దు సమీపంలోని నందా గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న రాజు, సునీత, వాణి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహారాష్ట్రలోని బోకర్ ఆస్పత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment