చిరుత దాడిలో రెండు ఎడ్లు మృతి

చిరుత దాడిలో రెండు ఎడ్లు మృతి

చిరుత దాడిలో రెండు ఎడ్లు మృతి

మనోరంజని ప్రతినిధి భైంసా సెప్టెంబర్ ౦౩

చిరుత దాడిలో రెండు ఎడ్లు మృతి

నిర్మల్ జిల్లా తానూర్ మండలం మొగిలి శివారులో చిరుతపులి దాడి చేసి రెండు ఎద్దులను చంపింది. దీంతో గ్రామంలోని ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటన మసల్గా తాండాకు చెందిన దేవిదాస్ గొప్ప జాదవ్ అనే రైతు పొలంలో జరిగింది. రోజులాగే రైతు తన ఎద్దులను పొలంలో కట్టేసి ఇంటికి వెళ్లగా తెల్లవారుజామున తిరిగి పొలానికి వెళ్లేసరికి రెండు ఎద్దులు చనిపోయి కనిపించాయి. రాత్రి సమయంలో చిరుతపులి దాడి చేసి చంపినట్లుగా గుర్తించారు. ఈ దాడిలో రూ.1.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడైన రైతు తెలిపారు. చిరుత సంచారంతో ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment