✒భారీ స్కామ్.. ఏఐ పేరుతో రూ.850 కోట్లు బురిడీ
HYD: ఏఐ ఆధారిత పెట్టుబడులు, క్రిప్టో
ట్రేడింగ్, పోంజీ స్కీమ్స్ పేరిట మోసగాళ్లు కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. తాజాగా నగరంలోని మాదాపూర్లోని ఏవీ సొల్యూషన్స్, ఐఐటీ క్యాపిటల్స్ పేరుతో భారీ స్కాం బయటపడింది. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి.. 3,164 మంది బాధితుల నుంచి ఏకంగా రూ.850 కోట్లను వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు