ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. శుక్రవారం ద్వారక సెక్టార్-7లోని ఒక పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు సమాచారం రాగా.. పోలీసులు, అగ్నిమాపక బృందాలు అప్రమత్తమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.