పోలీసుల అదుపులో పావురం..
ఎందుకంటే?
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానిపేటలో ఒక గూఢచారి పావురం కలకలం సృష్టించింది. ఒక మైనర్ బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన ఈ పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కొన్ని అక్షరాలు ఉన్నాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.